ఫైనల్లీ నాగబాబు కి కేబినెట్ హోదా

Nagababu Gets Cabinet Rank


నటుడు నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరి పార్టీ ఎదుగుదలకు పాటు పడడమే కాదు కొన్నాళ్ళు నటనకు బ్రేక్ ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డారు. అందులో భాగంగా జనసేన కూటమి ప్రభుత్వంలో భాగమయ్యాక నాగబాబు కి ఎమ్యెల్సీ పదవి కట్టబెట్టారు. ఎమ్యెల్సీ అయ్యాక నాగబాబు దూడుకుతో వ్యవహరిస్తూ టీడీపీ పార్టీతో వైరం పెట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు దూకుడుకు కళ్లెం వేసారు.

దానితో మళ్లీ నటనవైపు టర్న్ అయిన ఆయన రాజకీయాలకు కొద్దిగా దూరంగానే ఉంటున్నారు. ఇక చంద్రబాబు-పవన్ మంత్రి మండలిలో నాగబాబు కు మంత్రి పదవి వస్తుంది అనుకుంటే అప్పుడు అది కుదర్లేదు. కానీ తాజాగా నాగబాబు కి కేబినెట్ ర్యాంక్ పదవి లభించింది. మంత్రి పదవి ఆశిస్తే.. కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చారు.

ఏపీ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఈకోలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ  నాగబాబు నియమితులయ్యారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు ఏర్పాటు చేసిన ఈ కమిటీకి నాగబాబు చైర్మన్.

ఈ చైర్మన్ పదవితో పాటు, ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించే నాగబాబు కు కేబినెట్ ర్యాంకు హోదాను ఇచ్చారు. 

Nagababu has been appointed as the Chairman of the Green Executive Committee