ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rukmini Vasanth enters Malayalam industry

రష్మిక తర్వాత రుక్మిణీనే !

Rukmini Vasanth enters Malayalam industry

 

కన్నడ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న చాలా తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీ ల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక మందన్న వరస ఆఫర్స్ తో ఇప్పటికి ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉంది. బాలీవుడ్ లో టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

ఇప్పుడు అదే మాదిరి మరో కన్నడ భామ రుక్మిణి వసంత్ కూడా కనిపిస్తుంది. కన్నడ నుంచి మెల్లగా తెలుగు, తమిళ, మలయాళంలో పాప పాగా వేస్తుంది. కాంతార 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన రుక్మిణి వసంత్ ఇప్పుడు యశ్ తో టాక్సిక్ మూవీ చేసింది. ఆ చిత్రం రెండు వారాల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తుంది. ఆతర్వాత RC 17 లోను రామ్ చరణ్ సరసన రుక్మిణి వసంత్ పేరు వినబడుతుంది. ఇప్పుడు రుక్మిణి వసంత్ మలయాళం లోను క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. మలయాళ హీరో నివిన్ పౌలీ సరసన ఆమె నటించబోతుంది. కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ఈరోజే పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాతో రుక్మిణి వసంత్ మలయాళ చిత్రసీమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది.

మరి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషలతో రుక్మిణి వసంత్ పేరు బాగా వినిపించడమే కాదు ఆమె ఈ నాలుగు భాషల్లో క్రేజీ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. 


 

Rukmini Vasanth and Rashmika