Advertisement

విజయ్ కి ఇంతకన్నా అవమానమా?

Vijay Jana Nayagan opning collections


విజయ్ లాస్ట్ చిత్రంగా నిన్న గురువారం విడుదలైన జన నాయగన్ విడుదలకు ముందు ఉన్న క్రేజ్ చూసి ఈ చిత్రం ఓపెనింగ్స్ లో రూ.100 కోట్లు కొట్టడం ఖాయమని విజయ్ ఫ్యాన్స్ చాలా ఆశపడ్డారు. తమిళనాట జన నాయగన్ బుకింగ్స్ చూసి ఈ రూ.100 కోట్ల ఓపెనింగ్స్ ఫీట్ సాధించడం విజయ్ కు కష్టమేమి కాదనుకున్నారు.

కానీ విజయ్ లాస్ట్ చిత్ర జన నాయగన్ తమిళ ప్రేక్షకులకు ఆసక్తిగా అనిపించినా తెలుగు, హిందీ, ఓవర్సీస్ ఆడియన్స్ జన నాయగన్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించలేదు.. అని జన నాయగన్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. జన నాయగన్ మొదటి రోజు అన్ని వెర్షన్స్ అంటే వరల్డ్ వైడ్ గా రూ.88 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది.

మరి జన నాయగన్ రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ విషయంలో విజయ్ క్రేజ్ కనిపిస్తుంది, జన నాయగన్ కు రూ.100 కోట్ల ఓపెనింగ్ పక్కా అనుకున్న వారికి షాకింగ్ కలెక్షన్స్ రాగా.. విజయ్ చివరి చిత్రానికి రూ 100 కోట్ల ఓపెనింగ్ రాకపోవడం కన్నా అవమానం మరొకమిటీ ఉంటుందా అని విజయ్ యాంటీ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసారు.

ఓపెనింగ్స్ లోనే పవర్ చూపించలేని జన నాయగన్.. ఈ నెగెటివ్ టాక్ తో ఎలాంటి నెంబర్లు నమోదు చేస్తుందో అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. అటు విజయ్ ఫ్యాన్స్ కూడా జన నాయగన్ చూసి బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.

Vijay Jana Nayagan 1st day collections