సమంత ను టచ్ చెయ్యడం ఎవ్వరి వల్ల కాదు
Samantha returns to the No.1 spot
చేతిలో సినిమాలు లేవు, స్టార్ హీరోలతో నటించడం లేదు, నటనతో బిజీ కాదు అయినా సమంతను ఇష్టపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తరగడం లేదు. అందుకే సోషల్ మీడియాలోనూ సమంత హావ స్పష్టంగా కనిపిస్తుంది. అంతెందుకు సినిమాలు లేకపోయినా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనేది ప్రతి నెల ఓర్మాక్స్ మీడియా లో నిరూపితమవుతూనే ఉంది.
గత మూడు నెలలుగా ఓర్మాక్స్ మీడియా ఇండియా లవ్స్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిల్మ్ స్టార్స్ టాప్ 10 హీరోయిన్ జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన జూన్ నెల టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ లో మరోసారి సమంత టాప్ వన్ గా నిలిచింది. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ఫోటోషూట్స్, ట్వీట్స్ అన్ని ఆమెపై క్రేజ్ ను పెంచేస్తున్నాయి.
ఇక టాప్ 2 లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఉండగా.. టాప్ 3 లో దీపికా పదుకొనే ఉంది. టాప్ 4 ని నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలబెట్టుకుంది. టాప్ 5 స్థానాన్ని కాజల్ అగర్వాల్ సొంతం చేసుకోగా.. సీత గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి పల్లవి అనూహ్యంగా ఆరో స్థానంలోకి వచ్చేసింది.
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఏదో స్థానంలో ఉండగా.. క్రేజీగా టాప్ 5 లో ఉండాల్సిన లేడీ సూపర్ స్టార్ నయనతార టాప్ 8 లో కొనసాగుతుంది. టాప్ 9 లో త్రిష ఉంటె.. టాప్ 10 లో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల కొత్తగా ఈ లిస్ట్ లోకి చేరింది.








































