నంద‌మూరి వార‌సురాలు న‌ట‌న‌లోకి ఎంట్రీ?

 Balayya Daughter TejaswiniBalayya Daughter Tejaswini

నందమూరి ఆడపడుచు, విశాఖపట్నం ఎంపీ భరత్ భార్య అయిన తేజస్విని నటనారంగ ప్రవేశానికి ఇదే అత్యంత అనుకూలమైన తరుణమని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన తేజ‌స్విని కొన్ని డ్యాన్స్ వీడియోలు, సోషల్ మీడియా ప్రెజెన్స్ చూసిన వారెవరైనా నిజంగానే ఆశ్చర్యపోతున్నారు. ముంబై, ఢిల్లీ లాంటి నగరాల నుండి వచ్చే ఎంతోమంది ప్లాస్టిక్ బొమ్మల్లాంటి హీరోయిన్లతో పోలిస్తే, తేజస్విని ఆహార్యం, అభినయం, ముఖ్యంగా కళ్లతోనే హావభావాలను పలికించే సహజసిద్ధమైన లక్షణం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సైతం తన కెరీర్ ప్రారంభ చిత్రాలలో హావభావాల పరంగా అంతగా మెప్పించలేకపోయారు. కానీ తేజస్వినిలో ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్‌కు ఉండే లయ, ఈజ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నటిగా రాణించేందుకు కావలసిన అన్ని అర్హతలు, నందమూరి వారసత్వపు కళా నైపుణ్యాలు ఆమెలో పుష్కలంగా ఉన్నాయని నెటిజనులు ప్ర‌శంసిస్తున్నారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బలమైన నటనకు ఆస్కారమున్న లేడీ ఓరియెంటెడ్ కథలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇలాంటి తరుణంలో మన ప్రతిభావంతులైన దర్శకులు ఎవరైనా తేజస్విని నటనకు ప్రాధాన్యత ఉన్న ఒక అద్భుతమైన పాత్రతో పరిచయం చేస్తే..ఆమె తనను తాను ఒక గొప్ప నటిగా నిరూపించుకునేందుకు మంచి ఆస్కారం ఉంది.

నందమూరి కుటుంబం నుండి మహిళలెవరూ ఇప్పటివరకు వెండితెర నటన వైపు అడుగులు వేయలేదు. అయితే మారుతున్న కాలంతో పాటు తేజస్విని గనుక నటిగా ఎంట్రీ ఇస్తే సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. మరి ఈ నందమూరి వారసురాలు వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతుందో లేదో వేచి చూడాలి.

Tejaswini