మొన్న అల్లు అర్జున్ - ఇప్పుడు రామ్ చరణ్
Ram Charan buys luxury farmhouse on the outskirts of Hyderabad
ఈమధ్యన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో అద్భుతమైన హౌస్ నిర్మాణం గురించిన చర్చ మీడియాలో ఎంతగా జరిగిందో చూసారు. సుమారు 4 వేల చదరపు గజాల విశాలమైన విస్తీర్ణంలో అత్యాధునిక హంగులు, వాస్తు శిల్ప కళా రీతులతో నిర్మితమవుతున్న ఈ ఇంటి కోసం దాదాపు రూ. 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
ఇప్పుడు మరో మెగా హీరో, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కడుతున్న ఫామ్ హౌస్ ముచ్చట మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. గతంలో హైదరాబాద్ శివారులోని చేవెళ్ల-మోకిల పరిసర ప్రాంతంలో రామ్ చరణ్-ఉపాసన 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయగా.. ఇప్పుడు ఆ స్థలం లోనే రామ్ చరణ్ అత్యాధునిక హంగులతో కాస్ట్లీ ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారట.
ఇప్పటికే ఫామ్ హౌస్ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే గృహప్రవేశం కూడా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అద్భుతమైన ఇంటీరియర్, పచ్చదనం, ఆర్కిటెక్చర్ లాంటివి ఈ ఫామ్ హౌస్లో ఉండబోతున్నాయట. లగ్జరీ రూమ్స్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలతో ప్రైవేట్ రిసార్ట్ లా దీనిని తీర్చిదిద్దుతున్నారట.
కేవలం వీకెండ్స్ లో గడపడానికి మాత్రమే కాకుండా ప్రకృతి సేద్యం చేయడానికి అనువైన రీతిలో దీని డిజైన్ ఉంది అని తెలుస్తుంది.







































