జన నాయగన్ కోసం ఎగబడుతున్న ఓటీటీలు
Jana Nayagan OTT newsజనవరి 9 న విడుదల వాయిదా పడిన విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ చిత్రం విడుదల ఆలస్యమవడంతో జన నాయగన్ చిత్ర ఓటీటీ డీల్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడంతో నిర్మాతలకు దాదాపుగా రూ.120 కోట్ల లాస్ వచ్చింది. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచి సీఎం పీఠాన్ని అధిరోహించడంతో జన నాయగన్ కష్టాలు తొలిగిపోయినట్లే కనిపిస్తున్నాయి.
జన నాయగన్ విడుదలకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తుంది. స్టాలిన్ ప్రభుత్వం జన నాయగన్ విడుదల కాకుండా అడ్డుకోవడం, ఇప్పుడు విజయ్ సీఎం అవడంతో జన నాయగన్ విడుదల కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. మే నెల చివరి వారంలో జన నాయగన్ చిత్రం విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
మరోపక్క నిన్నటివరకు జన నాయగన్ ఓటీటీ డీల్ వదులుకున్నారు, కానీ ఇప్పడు జన నాయగన్ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం పలు ఓటీటీ లు ఎగబడడం ఆశ్చర్యంగా మారింది. జన నాయగన్ ఓటీటీ డీల్ వద్దనుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఇప్పుడు మళ్ళీ భారీ ఆఫర్ ఇస్తున్నట్టుగా టాక్.
జన నాయగన్ విడుదల వాయిదాలతో ఓటీటీ డీల్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో తప్పుకున్నాక జీ 5 రేస్ లోకి వచ్చింది అని తెలుస్తోంది. మరి ఫైనల్ గా జన నాయగన్ ఓటీటీ డీల్ ఎవరి చెంతకు చేరుతుందో చూడాలి.







































