ఆ తేదీ పై విశ్వంభర కన్ను

Vishwambhara release date updateVishwambhara release date update

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర గురించి చాలామంది మర్చిపోతున్నారు. విడుదల తేదీ ఇవ్వకుండా మెగా ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తున్న దర్శకుడు వసిష్ఠ ను తిట్టుకోని ఫ్యాన్స్ లేరు. విశ్వంభర రిలీజ్ తేదీ ని ఆల్మోస్ట్ అందరూ మరిచిపోతున్న సమయంలో విశ్వంభర న్యూస్ లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

విశ్వంభర రెండు భాగాలుగా రాబోతున్నాయా అనే ప్రచారాన్ని దర్శకుడు వసిష్ఠ క్లారిటీ ఇచ్చారు. విశ్వంభర కేవలం ఒక భాగంగానే రాబోతుంది అని చెప్పారు. తాజాగా విశ్వంభర విడుదల ఆగష్టు లో ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. విశ్వంభర ను ఆగస్ట్ 13 లేదా 14న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటున్నారు.

మరి ఈ తేదీ అయినా విశ్వంభర మేకర్స్ ఫిక్స్ చేస్తారా ఎప్పటిలాగే అది రూమర్ గా మారుతుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోపక్క సీజీ వర్క్ కంప్లీట్ అంటున్న ట్రైలర్ కానీ, లేదంటే మరో ప్రమోషనల్ ఈవెంట్స్ కానీ మొదలుపెట్టకుండా సహనానికి పరీక్ష పెడుతున్నారు. 

Chiranjeevi Vishwambhara