ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sai Pallavi startling revelation about Ek Din

ఆ పాత్రకు సరిపోనని తెలిసినా - సాయి పల్లవి

Sai Pallavi startling revelation about Ek Din

సాయి పల్లవి సినిమా ఒప్పుకుంది అంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుంది అనేలా ఆమె స్క్రిప్ట్ ల ఎంపిక ఉంటుంది. సాయి పల్లవి కథ విని, నచ్చితేనే సినిమా చేస్తుంది. పక్కన పెద్ద స్టార్ ఉన్నాడా, లేదంటే భారీ బడ్జెట్ సినిమా అని చూడదు. చిన్న సినిమా అయినా కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. ఇది సాయి పల్లవి స్పెషల్.

కానీ ఆమె హిందీ డెబ్యూ అలా లేదు. ఇది అసలు సాయి పల్లవి ఇష్టపడి చేసిన సినిమానేనా, ఆమె స్క్రిప్ట్ ఎంపికలో ప్రత్యేకత ఎక్కడికి పోయింది అనే డౌట్ అందరిలో కనిపించింది. ఆమిర్ ఖాన్ కొడుకు అని ఒప్పుకుందో, లేదంటే మారేదన్నా విషయమో తెలియదు కానీ ఆమె నటించిన ఏక్ దిన్ చిత్రం ఆడియన్స్ కి నచ్చలేదు. మొదటి వీకెండ్ కే థియేటర్స్ లో ఏక్ దిన్ పనైపోయింది.

తాజాగా ఈ సినిమా పై సాయి పల్లవి రియాక్ట్ అయ్యింది. ఆమె ఏక్ దిన్ లో చేసిన పాత్రకు తను సరిపోను అని షూటింగ్ సమాయంలోనే అర్ధమైనట్లుగా ఆమె ఆ సినిమా ప్రమోషన్స్ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ సినిమాకు తనను ఎంపిక చెయ్యడమే తప్పు.

షూటింగ్ సమయంలోనే నాకు చాలాసార్లు అనిపించింది. ఈ పాత్రకు తను సరిపోతానా అని అంటూ ఆమె చెప్పడం చూస్తే, ఏక్ దిన్ చూసిన వెళ్లి సాయి పల్లవి మాటలతో ఏకీభవించి తీరాల్సిందే. 

Sai Pallavi shocker about Ek Din