Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Boney Kapoor Breaks Silence On Janhvi Rumours

జాన్వీ కపూర్ పెళ్లిపై బోని కామెంట్స్

Boney Kapoor Breaks Silence On Janhvi Rumours

బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ ఈ ఏడాది పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం పై ఉన్న అంచనాలు, హైప్ చూస్తే పెద్ది బ్లాక్ బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే జాన్వీ కపూర్ కొన్నాళ్లుగా ఓ బాయ్ ఫ్రెండ్ ని మైంటైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
శిఖర్ పహారియా తో జాన్వీ కపూర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. వెకేషన్స్ కి మాత్రమే కాదు ఆమె శ్రీవారి దర్శనానికి కూడా శిఖర్ పహారియాతో కలిసి వెళుతుంది. దానితో జాన్వీ కపూర్ శిఖర్ ని ఈ ఏడాది వివాహం చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. తిరుమలలో పెళ్లి చేసుకుని పిల్లలతో సెటిల్ అవ్వాలని చెబుతుంటే.. జాన్వీ పెళ్లిపై ఆమె తండ్రి బోనికపూర్ క్లారిటీ ఇచ్చారు.
జాన్వీ కపూర్ పెళ్లి పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బోనికపూర్ ఖండించారు, జాన్వీ కపూర్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ ఒట్టి పుకార్లే అని ఆయన కొట్టిపారేశారు. మరి ఇప్పటికైనా జాన్వీ పెళ్లి వార్తలు ఆగుతాయో, లేదో చూడాలి.

Boney Kapoor Breaks Silence On Janhvi And Shikhar Pahariya's Wedding