Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trisha Krishnan spotted at the sacred Tirumala Tirupati Temple

విజయ్ ముందంజ - తిరుమలలో నటి త్రిష

Trisha Krishnan spotted at the sacred Tirumala Tirupati Temple


కోలీవుడ్ హీరో విజయ్ నటి త్రిష తో ఎఫ్ఫైర్ నడుపుతున్నాడు, అందుకే ఆయన భార్య సంగీత విజయ్ కు విడాకులిస్తుంది అన్న కొద్దిరోజులకే విజయ్-త్రిష ఒక పెళ్లి వేడుకలో కలిసి కనిపించడం, ఒకే కారులో ప్రయాణించడం ఇవన్నీ ఆ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. త్రిష ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం, విజయ్ భార్య సంగీత ఓ నటితో విజయ్ సన్నిహితంగా ఉంటున్నారనే కారణంతో విడాకుల కోసం అప్లై చెయ్యడం ఇవన్నీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు విజయ్ పై నెగిటివిటి పెంచాయి.
ఎన్నికల ముందు జరిగిన ఈ విడాకుల డ్రామా, విజయ్ తో త్రిష కు ఉన్న అనుబంధం ఇవన్నీ విజయ్ ని తమిళనాట ఎన్నికల్లో ఘోరంగా ఓడిస్తాయనుకుంటే అనూహ్యంగా విజయ్ తమిళనాట ప్రభంజనం సృష్టించేందుకు రెడీగా కనిపిస్తున్నారు. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతుండగా.. విజయ్ టీవీకే పార్టీ 100 స్థానాలకు పైగా ముందంజలో ఉంది. 
🔥 తమిళనాడు ట్రెండ్స్..! 🔥
మొత్తం సీట్లు : 234, మ్యాజిక్ ఫిగర్ : 118
TVK : 106 సీట్లలో ఆధిక్యం
AIADMK+ : 72 సీట్లలో ఆధిక్యం
DMK+ : 48 సీట్లలో ఆధిక్యం
మరి విజయ్ విజయం పక్కాగా కనిపిస్తున్న తరుణంలో ఈరోజు త్రిష తిరుమల వేంకటేశ్వరుడు దర్శనానికి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. ఈరోజు మే 4 త్రిష బర్త్ డే. త్రిష బర్త్ డే రోజున ఆమె శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లినప్పటికీ ఆమె విజయ్ గెలుపు కోరుకునే వేంకటేశ్వరుడి ని దర్శించుకుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
అక్కడ తమిళనాట విజయ్ పార్టీ ముందంజలో ఉంటే ఇక్కడ త్రిష తిరుమలలో ఈరోజు విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం.
 

Vijay sensation in TN, to become CM