పెద్ది టార్గెట్ స్టార్ట్

గత రెండు నెలలుగా ఎంతో అతృతతో మెగా ఫ్యాన్స్ పెద్ది చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 30 కి ఏప్రిల్ 30 నుంచి జూన్ 26 కి పోస్ట్ పోన్ అయిన పెద్ది చివరికి టాక్సిక్ వాయిదా తో ముందుకొచ్చేసి మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ ఇచ్చింది. జూన్ 4 న పెద్ది రిలీజ్ అంటూ అనౌన్స్ చేసారు మేకర్స్.
ఈరోజు కి ఖచ్చితంగా నెల ఉంది పెద్ది రిలీజ్. మరి పెద్ది టార్గెట్ మొదలైపోయింది. అంటే నెల రోజులు మీడియాలో పెద్ది హడావుడి మాములుగా కనిపించదు. పాన్ ఇండియా మార్కెట్ లో భీభత్సమైన అంచనాలతో అడుగుపెడుతున్న పెద్ది చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానులే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా వెయిటింగ్.
ఇక పెద్ది ట్రైలర్ ని మే మిడిల్ అంటే మే 17 లేదా 18 న గ్రాండ్ ఈవెంట్ తో వదిలేందుకు చూస్తున్నారు. రామ్ చరణ్ ఈనెల మొత్తం పెద్ది టీమ్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారని, దర్శకుడు బుచ్చిబాబు పోస్ట్ ప్రొడక్షన్ అలాగే ప్రమోషన్స్ చూసుకుంటే రెహమాన్ ఆర్.ఆర్ లో బిజీగా ఉంటారని తెలుస్తుంది.








































