UBS - అడ్వాన్స్ మాత్రమే అందుకున్న పవన్
UBS-Pawan Kalyan took a very nominal advanceపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మరికొద్దిగంటల్లోనే థియేటర్స్ లో సందడి చేసేందుకు అన్నిరకాలుగా సిద్దమైంది. చివరిగా దర్శకుడు హరీష్ శంకర్ హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా.. ప్రొడ్యూసర్స్ తో కలిసి ఉస్తాద్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలను హరీష్ శంకర్ చెప్పారు.
అందరూ మరో గబ్బర్ సింగ్ ఇవ్వు అన్నా అని అడుగుతున్నారు, గబ్బర్ సింగ్ రీమేక్ కదా.. మరెందుకు ఇప్పుడు రీమేక్ వద్దు అంటున్నారు. నన్ను నా సినిమాని సోషల్ మీడియాలో కెలికినవాళ్లకు అగ్రెసివ్ గా ఇచ్చే రిప్లై వలన కొంతమంది పనిగట్టుకొని ఉస్తాద్ భగత్ సింగ్ ని రీమేక్ అని ప్రచారం చేస్తున్నారు. తమిళ హిట్ మూవీ తేరి రీమేక్ ఉస్తాద్ అంటున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ స్ట్రయిట్ మూవీ అని హరీష్ మరోమారు క్లారిటీఇచ్చారు.
ఇక ప్రొడ్యూసర్స్ ని మీడియా వారు ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ గారు రెమ్యురేషన్ లో ఏమైనా తిరిగి ఇచ్చారా.. సినిమా విడుదల లేట్ అయ్యింది, ఎప్పుడో ఐదారేళ్ళ క్రితం స్టార్ట్ అయ్యింది కదా అని అడిగితే దానికి ఉస్తాద్ ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ గారు కేవలం చిన్నపాటి అడ్వాన్స్ తప్ప ఈ చిత్రానికి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు అంటూ షాకిచ్చారు.
సో సినిమా హిట్ అయితే పవన్ కళ్యాణ్ పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకుంటారు, లేదంటే మరి అనేది ఇప్పుడు అభిమానుల మనస్సులో మెదులుతున్న ప్రశ్న.
Ustaad Bhagat SIngh-No more Remuneration for Pawan Kalyan







































