Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Is In Need Of Some Good Luck In April 2026

అదే విజయ్ లైఫ్ ని డిసైడ్ చేయబోతుందా..

Vijay Is In Need Of Some Good Luck In April 2026

కోలీవుడ్ హీరో విజయ్ కి ఒకే ఒక్క నెల ప్రత్యేకంగా నిలవబోతుందా. అదే నెల విజయ్ పర్సనల్ లైఫ్ ని, కెరీర్ ని డిసైడ్ చేయబోతుందా.. అది ఏ నెల అంటే ఏప్రిల్ నెల. విజయ్ తన వ్యక్తిగత జీవితంలో భార్య సంగీత ఇచ్చిన డివోర్స్ నోటీసు తో సతమతమవుతున్నారు. ఏప్రిల్ 20 న విజయ్ ఈ విడాకుల కేసు విషయంగా కోర్టుకు వెళ్లాల్సి ఉంది. అదే రోజు విజయ్ ఇంకా సంగీత తో ఉండాలా.. లేదంటే సింగిలా అనేది తెలుస్తుంది. 

ఇక అదే ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. సో పొలిటికల్ గా సింగిల్ గానే పోటీ చేస్తున్న విజయ్ రాజకీయ భవితవ్యం తేలేది ఆ రోజే. ప్రస్తుతం TVK పార్టీ ని బలంగా ప్రజల్లోకి తెలుసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్న విజయ్ కి ఈ ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ గెలుపే ద్యేయంగా పని చేస్తున్నారు. 

విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయకన్ సెన్సార్ ఇష్యుస్ ఓ కొలిక్కి వస్తే ఎనీ టైం అంటే ఏప్రిల్ లోనే సినిమా విడుదల కూడా ఉండొచ్చనే ఊహాగానాలు నడుమ విజయ్ కి ఈ ఏప్రిల్ నెల ఎంతో కీ రోల్ పోషించనుంది అని మాత్రం అర్ధమవుతుంది. 

Vijay will be making his maiden electoral debut ahead of the April 23 election

vijay