ఓటీటీ లో సౌండ్ చెయ్యని రవితేజ సినిమా
Ravi Teja movie without sound on OTTచాలా రోజుల తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిజల్ట్ తో రవితేజ ఊపిరి పోసుకున్నారు. గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ కు భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం కాస్త ఊరటనిచ్చింది. కానీ సంక్రాంతి సీజన్ లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి జోరులో కొట్టుకుపోయింది.
ఈ చిత్ర ఓటీటీ హక్కులు దక్కించుకున్న జీ 5 ఎందుకో ఏమిటో రెండు నెలల సమయం తీసుకుని మార్చ్ 13 నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చారు. జీ 5 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ఎలాంటి చప్పుడు చెయ్యడమే లేదు. అసలు ఓటీటీ టాక్ అంటూ ఎవ్వరూ భర్త మహాశయులకు విజ్ఞప్తి గురించి ట్వీట్ కూడా వెయ్యట్లేదు.
మరి థియేటర్స్ యావరేజ్ చిత్రం ఓటీటీలో హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ లో సౌండ్ చెయ్యలేదు. అన్నట్టు గత వారమే ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈ చిత్రం బుల్లితెర ప్రీమియర్స్ కి రెడీ అయ్యింది. వచ్చే ఆదివారం అంటే మార్చ్ 2 సాయంత్రం జీ తెలుగు నుంచి BMW బుల్లితెరపై ప్రీమియర్స్ గా సందడి చేసేందుకు రెడీ అయ్యింది.
Ravi Teja Bhaktha Mahashayulaku Wignyapthi OTT talk







































