Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> TVK dismisses speculation of alliance with NDA

సింహం సింగిల్ గానే వస్తుంది

TVK dismisses speculation of alliance with NDA

సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ ఇప్పుడు అదే అభిమాన బలంతో రాజీకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తోనే ఆయన్ని అనేక సమస్యలు చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. అయినప్పటికీ విజయ్ కాన్ఫిడెంట్ గా ముందడుగు వేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లో ఒంటరిగా పోరాడుతారా, లేదంటే పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారా అనే విషయంలో నిన్నటివరకు చాలా కన్ఫ్యూజన్ నడిచింది.

బిజెపి విజయ్ ని అన్ని విధాలుగా లాక్ చేసినా విజయ్ ఏ మాత్రం తొణకడం లేదు. ఇంటిపోరు, అటు చివరి సినిమా కష్టాలు ఇవన్నీ విజయ్ ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇక విజయ్ ఢిల్లీ వెళ్లడంతో.. విజయ్ పార్టీ బిజెపి కలిసి పోటీ చేస్తారేమో, పొత్తు పెట్టుకోవడానికే విజయ్ ఢిల్లీ వెళ్లారనే వార్తలు వినిపించాయి.

విజయ్ తమతో కలుస్తారని బీజేపీ అగ్రనాయకత్వం చాలా నమ్మకంతో ఉంది. కానీ విజయ్ మాత్రం తన సిద్ధాంతాలకు కట్టుబడి ఒంటరిగానే పోటీకి దిగుతున్నారు. తనపై అభిమానుల్లో, ప్రజల్లో ఉన్న మంచి ఒపీనియన్ తనని ఎలాగైనా గెలిపిస్తుంది అని విజయ్ నమ్ముతున్నారు. మరోపక్క అసెంబ్లీ స్థానాల్లో అన్ని ఏరియాల్లో అభ్యర్థులను నిలపడం కూడా విజయ్ కి సులువైన పని కాదు.

మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాదిరి ఓ పదేళ్లు పాటు విజయం కోసం విజయ్ ఎదురు చూస్తారో లేదంటే సింగిల్ ఎటం లోనే విజయ్ పొలిటికల్ లీడర్ గా తనదైన ముద్ర వేసి తమిళ రాజకీయాలను శాసిస్తారో చూడాలి.

Vijay dismisses talks of joining NDA in Tamil Nadu

vijay