నారా దేవాన్ష్ దోతీ వేడుకలో మోక్షజ్ఞ
Nara Lokesh son Devansh Dhoti ceremonyనందమూరి నటసింహ బాలకృష్ణ వారసుడి సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యే రోజు కోసం నందమూరి అభిమానులు వెయిట్ చెయ్యని రోజు లేదు. మోక్షజ్ఞ డెబ్యూ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్న వేళ నారా బ్రాహ్మణి కొడుకు నారా దేవాన్ష్ దోతీ సెర్మోని లో మోక్షజ్ఞ దర్శన భాగ్యం నందమూరి అభిమానులకు దక్కింది.
నందమూరి బాలకృష్ణ, వసుంధరలు చేతుల మీదుగా మనవడు నారా దేవాన్ష్ కి నూతన వస్త్రాలంకరణ వేడుకను నిర్వహించారు. అందుకు సంబందించిన ఫొటోస్ నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ అలాగే నారా చంద్రబాబు ఫ్యామిలిస్ మధ్యన నడుమ దేవాన్ష్ దోతీ వేడుక సింపుల్ గా జరిగినట్లుగా తెలుస్తుంది.
బాలయ్య చిన్నల్లుడు భరత్ ఈవేడుకలో కనిపించలేదు, కుమార్తె తేజస్విని మాత్రమే ఈ వేడుకకుహాజరైంది. కారణం భరత్ తాతగారు కావూరి సాంబశివరావు రీసెంట్ గానే కాలం చేసారు.
ఇక దేవాన్ష్ దోతీ వేడుకలో చాలా రోజుల తర్వాత నందమూరి వారసుడు మోక్షజ్ఞ కనిపించడం అభిమానులను ఎగ్జైట్ అయ్యేలా చేసింది.
Nara Lokesh Son Devansh Dhoti Ceremony Photos Viral







































