UBS ట్రైలర్ - ఈసారి పెరఫార్మెన్స్ బద్దలైపోద్ది
Ustaad Bhagat Singh Trailer Talkఉస్తాద్ భగత్ సింగ్.. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో నోట్లో మెదులుతున్న సినిమా. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది. ఈరోజు శనివారం సాయంత్రం విడుదలైన ఉస్తాద్ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ లుక్స్ అంతకుమించిన పవర్ ఫుల్ డైలాగ్స్ అన్ని ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చిపడేసే గోత్రం..ఇరగదీసే నక్షత్రం, ఈసారి పెరఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ పవన్ చెప్పిన చివరి డైలాగ్ కి థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే.
హరీష్ శంకర్ మేకింగ్, పవన్ కళ్యాణ్ పెరఫార్మెన్స్, హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా గ్లామర్, థమన్, దేవిశ్రీ మ్యూజిక్ అండ్ BGM. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ దేనికవే సాటి అనేలా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కట్ ఉంది. మరి ప్రేక్షకులారా.. మార్చ్ 19 థియేటర్స్ లో దుమ్మురేపడానికి మీరు రెడీనా..
Ustaad Bhagat Singh Trailer Released







































