Advertisement

ఉస్తాద్ ఊపు రావట్లే

మార్చ్ 19 న విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం పై అంచనాలు ఎలా ఉన్నా.. కామన్ ఆడియన్స్ లో సినిమాపై ఎంత క్రేజ్ ఉంది అనేది క్లారిటీ రావడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కి దర్శకుడు హరీష్ శంకర్ అదిరిపోయే ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లాన్ చేసి కంటెంట్ వదులుతున్నాడు. ఓపెన్ గ్రౌండ్ లోని ఉస్తాద్ వస్తుంది. 

కానీ సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఊపు కనిపించడం లేదు. హరీష్ శంకర్ ఎంతగా సినిమాని ప్రమోట్ చేస్తున్నా ఉస్తాద్ కంటెంట్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో వైరల్ అవ్వకపోవడం పవన్ ఫ్యాన్స్ ని కలిచి వేస్తోంది. హీరోయిన్స్ ని ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చెయ్యాలి.

పవన్ కళ్యాణ్ కూడా ఉస్తాద్ ప్రమోషన్స్ లో చెయ్యి వేస్తేనే క్రేజ్ బాగా పెరుగుతుంది. మరోపక్క ధురంధర్  2 హవా చూస్తే ఉస్తాద్ ఎక్కడ డల్ అవుతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు ఆడియన్స్ ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ ని చూజ్ చేసుకోవాలి, అప్పుడే మనం మన సినిమాకి న్యాయం చేస్తాం.

పేక్షకులారా.. ముందుగా తెలుగు సినిమానే ఎంచుకోండి అంటూ కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. మరి ఉస్తాద్ పై ఊపు రావాలంటే మార్చ్ 14 న రాబోయే ట్రైలర్ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో చూడాలి. 

Pawan Kalyan - Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh
ustaad bhagat singh