Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> A stunning treat for Allu Arjun birthday

అల్లు అర్జున్ బర్త్ డే కి అద్దిరిపోయే ట్రీట్

A stunning treat for Allu Arjun birthday

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఇంటర్నేషనల్ స్థాయిలో #AA22 చిత్రం చేస్తున్నారు. పుష్ప సీరీస్ తో నేషనల్ వైడ్ గా క్రేజీ హీరోగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ తో చేస్తున్న చిత్రం పై అంచనాలు పెరిగేలా చేసింది. అనౌన్సమెంట్ వీడియో తోనే #AA22 సంచనాలకు తెరలేపింది.

అప్పటినుంచి సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్న #AA22 కి సంబందించిన ఏ అప్ డేట్ ఇవ్వకుండా అంతా ఏప్రిల్ 8 కోసం అంటే అల్లు అర్జున్ బర్త్ డే కోసం దాచేసారు. అల్లు అర్జున్ బర్త్ డే కి #AA22 టైటిల్ మాత్రమే కాదు అంతకు మించి ట్రీట్ ని దర్శకుడు అట్లీ రెడీ చేస్తున్నారట.

అనౌన్సమెంట్ వీడియో కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి అంతకు మించి అల్లు అర్జున్ బిర్ట్ డే ని అట్లీ ప్లాన్ చేశారట. టైటిల్ తో పాటుగా హై-కాన్సెప్ట్ వీడియో టీజర్ ని కూడా సిద్ధం చేస్తున్నారట. ఈ టీజర్ తోనే సినిమాకి భారీ హైప్ తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమా విడుదల వరకు అల్లు అర్జున్-అట్లీ మూవీ గురించే మాట్లాడుకునేలా ఉండాలని అట్లీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారట.

మరి 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరక్కెడుతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉండడమే కాదు అందుకు తగ్గ ప్రమోషన్స్ ను కూడా అట్లీ అండ్ టీమ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తోంది. 

AA22 update on Allu Arjun birthday

aa22