పవన్ ని దించు హరీష్
Pawan Kalyan-Harish Shankarఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆశాజ్యోతి ఈ చిత్రమే. కారణం గత కొన్ని వారాలుగా బాక్సాఫీసు ని చూస్తే ప్రేక్షకులకు నీరసం వచ్చేస్తుంది. మీడియం రేంజ్ సినిమాలు కూడా ఇంప్రెస్స్ చెయ్యలేక చేతులెత్తేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అందరూ మార్చ్ 19 న రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఆశలు పెట్టుకున్నారు.
హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ చెయ్యడమే కాదు.. ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ వదులుతూ క్రేజ్ పెంచుతున్నారు. అయితే ఉస్తాద్ కి ఎంత క్రేజ్ పెంచినా బాలీవుడ్ ధురంధర్ 2 పై తెలుగు ఆడియన్స్ లో అంతకంతకు ఆసక్తి పెరిగిపోతుంది. ధురంధర్ 2 విడుదల అయిన మరుక్షణమే చూడాలనే క్యూరియాసిటీతో కనిపిస్తున్నారు.
ధురంధర్ 2 ట్రైలర్ వచ్చాక ఆ ఇంట్రెస్ట్ తెలుగు యువతలో ఎక్కువైయ్యింది. మరి ధురంధర్ ద రివెంజ్ దూకుడు కు కళ్లెం వేయాలంటే పవన్ కళ్యాణ్ దిగాలి, హరీష్ శంకర్ ఎలాగోలా ఒప్పించి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ కి పవన్ ని దించాలి. అప్పుడే సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది.
అందుకే పవన్ ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ లో కనిపించేలా చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ లేకపోయినా.. ఓపెనింగ్స్ లో ప్రభంజనం సృష్టిస్తుంది అంటూ పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని కోరుతున్నారు.
Pawan Kalyan Ustaad Bhagat Singh







































