పెళ్లి పీటలేక్కబోతున్న యువ హీరో
Bellamkonda Srinivas Set to Tie the Knotఇప్పుడు టాలీవుడ్ లో పెళ్లి భాజాలు తెగ మోగుతున్నాయి. ఈ ఏడాది పెళ్లి ముహుర్తాలు స్టార్ట్ అయ్యాయి. ఆ వెంటనే విజయ్ దేవరకొండ-రష్మికలు వివాహం చేసుకుని నిన్నటివరకు సందడి చేసారు. మరోపక్క అల్లు అరవింద్ ఇంట పెళ్లి. గత వారం రోజులుగా ఏదో ఒక ఈవెంట్ అల్లు వారింట హైలెట్ అవుతూనే ఉంది. ఈరోజు మార్చ్ 6 శిరీష్-నయనిక ల వివాహం.
ఇక ఇప్పుడు మరో యువ హీరో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడనే వార్త వినిపిస్తుంది. కిష్కిందపురి తో సక్సెస్ అందుకుని వరస సినిమాల్తో బిజిగా వున్న బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్ళికి సిద్దమయ్యాడట. త్వరలోనే ఈ హీరో కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు అని తెలుస్తుంది. మార్చ్ 8 న బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్ధం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది.
గత కొద్దిరోజులుగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు. కానీ శ్రీనివాస్ తాను ప్రేమించిన అమ్మాయిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు బెల్లంకొండ ఇంట కూడా పెళ్లి భాజాలు మొగబోతున్నాయన్నమాట. అతి త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ చేసుకోబోయే అమ్మాయి వివరాలు తెలుస్తాయని సమాచారం.
Bellamkonda Sreenivas getting engaged on March 8th







































