ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Thanuja Birthday Celebration by Madhuri

తనూజ అంటే ఎంత ప్రేమో

Thanuja Birthday Celebration by Madhuri

బిగ్ బాస్ హౌస్ లో క్వీన్ గా ఎంట్రీ ఇచ్చిన తనూజ పుట్టస్వామి తెలుగు ప్రేక్షకుల హృదయాలకు ఎంత దగ్గరయ్యిందో అందరూ చూసారు. కట్టు బొట్టు, మాట, నడవడిక అన్ని తనూజ ను అందనంత ఎత్తులో నిలిపాయి. రన్నర్ గా నిలిచింది కానీ విన్నర్ అవ్వాల్సిన మెటీరియల్ ఆమెది. ఇక హౌస్ లో తనుజను ఇష్టపడిన వాళ్ళూ ఉన్నారు, ఆమెను విపరీతంగా ద్వేషించిన వాళ్ళూ ఉన్నారు.

అందులో బయట నుంచి తనూజ పై విపరీతమైన నెగిటివిటీ తో అడుగుపెట్టిన దివ్వెల మాధురి హౌస్ లోకి వెళ్ళాక తనూజ నడవిడికను చూసి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేసింది. కాదు తల్లి ప్రేమను పంచింది. తనూజ కూడా మధురిని ముద్దుగా మ్యాడి, రాజు అంటూ ప్రేమగా పిలిచేది. హౌస్ బయట కూడా వాళ్ళ బాండింగ్ క్యూట్ గా కనిపించింది.

నిన్న మార్చ్ 5 న తనూజ బర్త్ డే. ఆమె తిరుమల వెళ్ళింది. తనూజ బర్త్ డే కి మాధురి సర్ ప్రైజ్ ఇస్తూ ఆమెతో కేక్ కట్ చేయించి చీర గాజులు పెట్టి చెవి దుద్దులు గిఫ్ట్ గా ఇచ్చింది. హ్యాపీ బర్త్ డే బంగారు.. మై స్వీట్ హార్ట్ అంటూ తనూజాకు మాధురి విషెస్ చెప్పిన వీడియో షేర్ చెయ్యగానే తనూజ అంటే మాధురి కి ఎంత ప్రేమ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Thanuja Puttaswamy Birthday Celebration

thanuja