ఉస్తాద్ భగత్ సింగ్ పై ఈ వార్తలేల

UBS getting advanced

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించడమే కాదు దర్శకుడు హరీష్ శంకర్ అందుకు అనుగుణంగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. సినిమాపై హైప్ పెంచుతూ మాట్లాడుతున్నారు.

అయితే తాజాగా యష్ టాక్సిక్ మార్చ్ 19 నుంచి పోస్ట్ పోన్ అవడంతో ఇప్పుడు ఆ తేదికి ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రీ పోన్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ ఇంకా నిర్మాతలు ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రీ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారంటున్నారు. మరోపక్క ధురంధర్ 2 మార్చ్ 19 వస్తుంది.

అంత క్రేజ్ ఉన్న సీక్వెల్ పైకి ఉస్తాద్ భగత్ సింగ్ ని దించడం అవసరమా అంటుంటే.. అప్పుడే గా పవన్ స్టామినా బయటపడుతుంది. ఓపెనింగ్స్ లో పవన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.. అంటూ పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. 

Ustaad Bhagat Singh getting preponed, surprising developments

ustaad bhagat singh