అనిరుద్ దెబ్బ‌కి అంతా ఔట్..

Anirudh Ravichander

కోలీవుడ్లో కొంత కాలంగా అనిరుద్ చందంద‌ర్ హ‌వానే న‌డుస్తోంది. స్టార్ హీరోల సినిమాల‌న్నింటికీ అత‌డే సంగీతం అందిస్తున్నాడు. హీరోలు, ద‌ర్శ‌కులు ఏరికోరి మ‌రీ అనిరుద్ ని తీసుకుంటున్నారు. అవ‌స‌ర‌మైతే  అత‌డు అడిగిన దానికంటే అధికంగా పారితోషికం చెల్లించి మ‌రీ తీసుకొస్తున్నారు. పాట‌లు స‌హా ఆర్ ఆర్ అందించ‌డంలో అత‌డో బ్రాండ్ గా మారిపోవ‌డంతో?  స్టార్ హీరోలంతా బ్యాక్ టూ బ్యాక్ అత‌డినే ఎంచుకుంటున్నారు.

క‌థ‌లో బ‌లం లేక‌పో యినా?  అనిరుద్ అందించే ఆర్ ఆర్ తోనైనా గ‌ట్టెక్కొచ్చు అన్న కోణంలో అంతా అత‌డి వైపే చూస్తున్నారు. అనిరుద్ ఇలా ఫేమ‌స్ అవ్వ‌డంతో కోలీవుడ్ లో కొంత మంది సంగీత ద‌ర్శ‌కులు అవ‌కాశాలు కోల్పోతున్నారు అన్న‌ది అంతే వాస్త‌వం. ఒక‌ప్పుడు హ్యారీస్ జైరాజ్ సంగీత ద‌ర్శ‌కుడిగా  చాలా బిజీగా ఉండేవారు. స్టార్ హీరోల చిత్రాల‌న్నింటికీ అత‌డే సంగీతం.

రెహ‌మాన్ బాలీవుడ్ కి వెళ్లిపోయిన త‌ర్వాత‌..ఇళ‌య రాజా సినిమాలు త‌గ్గించిన త‌ర్వాత హ్యారిస్ హ‌వా కొంత కాలం కొన‌సాగింది. కొన్ని తెలుగు సినిమాల‌కు హ్యారీస్ సంగీతం అందించాడు. అలాగే యువ‌న్ శంక‌ర్ రాజా కూడా ఎన్నో సినిమాల‌కు సంగీతాన్ని అందించాడు. తండ్రి ఇళ‌య‌రాజా వార‌స‌త్వాన్ని దిగ్విజ‌యంగా కోలీవుడ్ లో కొన‌సాగిస్తున్నాడు.

అయితే కొంత కాలంగా ఇత‌డికి అవ‌కాశాలు త‌గ్గాయి. అలాగే రెహ‌మాన్ మేన‌ల్లుడు జీవి. ప్ర‌కాష్  కుమార్ పై కూడా అనిరుద్ ప్ర‌భావం ప‌డింది. మునుప‌టి అంత బిజీగా జీవి సంగీత ద‌ర్శ‌కుడిగా సినిమాలు చేయ‌లేదు. ఇంకా సంతోష్ నారాయ‌ణ్,  డి ఇమ్మాన్ లాంటి కంపోజ‌ర్స్ కూడా ఏమంత బిజీగా లేరు. ఏడాదికి మూడు నాలుగు సినిమాల‌తో బిజీగా ఉండే కంపోజ‌ర్స్ అంతా ఒక సినిమాతోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తోంది. 

Music Director Anirudh Ravichander

anirudh ravichander