కంటెంట్ స‌హా మెగా అల్లుడిపై న‌మ్మ‌కంతో!

Sai Durga Tej

మెగా మేన‌ల్లుడు సాయితేజ్ క‌థానాయ‌కుడిగా రోహిత్ కెపి ద‌ర్శ‌క‌త్వంలో  `సంబ‌రాల ఏటిగ‌ట్టు` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. హ‌నుమాన్ ఫేం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి  భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు 125 కోట్ల బ‌డ్జెట్ గా తెలిసింది. మ‌రి  సాయితేజ్ పై ఇంత బ‌డ్జెట్ పెట్టొచ్చా? అందుకు అత‌డు అర్హుడేనా? అంటే కొన్ని విష‌యాలు చ‌ర్చించాలి.

సాయితేజ్ స‌హా క‌థ‌, ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేదు. సాయితేజ్ గ‌త సినిమా `విరూపాక్ష` అత‌డిని ఏకంగా 100 కోట్ల క్ల‌బ్లో కూర్చో బెట్టింది. విరూపాక్ష స‌మ‌యానికి సాయితేజ్ వ‌రుస ప్లాప్ ల‌తో వున్నాడు. అత‌డితో సినిమా తీస్తే న‌ష్టాలు తప్ప లాభాలు రావు అన్న స‌మ‌యంలో?  `విరూపాక్ష‌`తో గొప్ప విజ‌యాన్ని అందుకున్నాడు.

మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయింది.  ఆ విజ‌యంతో సాయితేజ్ మార్కెట్ పెరిగింది. అలాగే రోహిత్ కె.పి కొత్త కుర్రాడు. ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఎలాంటి అనుభ‌వం లేదు. `సంబ‌రాల ఏటిగ‌ట్టు` తొలి చిత్రం. అత‌డు రాసిన క‌థ‌పై న‌మ్మకంతో నిర్మాత‌లు రాజీ లేకుండా ఖ‌ర్చు పెడుతున్నారు.

అయితే రోహిత్ కె.పీ `లాల్ సింగ్ చద్దా` , `బంటీ ఔర్ బబ్లీ 2` వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ప‌ని చేసాడు. బాలీవుడ్ లో ప‌నిచేస్తే గొప్ప టెక్నీషియ‌న్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అక్క‌డ ఎంతో అడ్వాన్స్ గా టెక్నీషియ‌న్లు ప‌ని చేస్తారు. అదే అనుభ‌వంతో?  సంబ‌రాల ఏటిగ‌ట్టును పూర్తి చేస్తున్నాడు.

Mega Hero Sai Durga Tej

sai durga tej