ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manchu Heroes second innings adversary

మంచు హీరోల సెకండ్ ఇన్నింగ్స్ అదుర్స్

Manchu Heroes second innings adversary

మంచు వారి హీరోలు గట్టిగానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు. మంచు విష్ణు ఎలా ఉన్నా.. మంచు మోహన్ బాబు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా స్ట్రాంగ్ గా మొదలు పెట్టినట్లుగా ఆయన నుంచి వస్తున్న సినిమాల లుక్స్ తెలియజేస్తున్నాయి. ది ప్యారడైజ్ లో మోహన్ బాబు హీరో నాని కి విలన్ గా కనిపించబోతున్నారు. అందులో వింటేజ్ విలన్ లుక్ లో మోహన్ బాబు కనిపించారు.

ఇక తాజాగా అశోక్ గల్లా చిత్రం శ్రీనివాస మంగాపురం చిత్రంలో మోహన్ బాబు లుక్ రివీల్ చేసారు. ఈ రెండు లుక్స్ లోను మోహన్ బాబు చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారు. ఇక మరో హీరో మంచు మనోజ్ కూడా విలన్ గా తన రీ ఎంట్రీని స్టార్ట్ చేసాడు. మిరాయ్ చిత్రంలో విలన్ గా మంచు మనోజ్ మెప్పించాడు.

అంతేకాకుండా హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. తండ్రి కొడుకులకు రియల్ లైఫ్ లో అస్సలు పడడం లేదు, అలాంటి సమయంలో అటు తండ్రి మోహన్ బాబు, ఇటు కొడుకు మంచు మనోజ్ లు నువ్వా-నేనా అన్నట్టుగా  ఒకే సమయంలో తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు. అందులో ఎవరు నెగ్గుతారో, ఎవరిది పై చెయ్యి అవుతుందో చూడాలి. 

Mohan Babu second innings in movies

mohan babu