వివాదాస్పద సినిమా విడుదలకు కోర్టు బ్రేకులు

The Kerala Story 2 Release Stalled

గతంలోనే కేరళ స్టోరీ అనేక అడ్డంకులు దాటుకుని థియేటర్స్ లో విడుదలైన ప్రభంజనం సృష్టించింది. అదః శర్మ మెయిన్ లీడ్లో తెరకెక్కిన ది కేరళ స్టోరీ ని బ్యాన్ చెయ్యాలంటూ కేరళ వ్యాప్తంగా ఎంత రచ్చ జరిగిందో అంతకుమించిన రచ్చ దాని సీక్వెల్ ది కేరళ స్టోరీ 2 కి మొదలైంది. 

కేరళ రాష్ట్రం మీద మచ్చ తెచ్చేలా కేరళ స్టోరీ 2 ఉంది అంటూ ఈ చిత్రంపై విపరీతమైన విమర్శలొస్తున్నాయి. కానీ దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ మాత్రం తన కథ వస్తున్న తప్పడు వాదనలను ఖండిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని(సెన్సార్ సర్టిఫికెట్ పొంది) రేపు ఫిబ్రవరి 27 న విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 విడుదలకు కోర్టు బ్రేకులు వేసింది.

కేరళ స్టోరీ 2 విడుదల ఆపాలంటూ.. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ హై కోర్టు సినిమా విడుదల నిలిపివేస్తూ.. రెండు వారాల గడువు ఇస్తూ ఆలోగా తదుపరి విచారణను పూర్తి చేయాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరికొన్ని గంటల్లో విడుదల కావాల్సిన కేరళ స్టోరీ చివరి నిమిషంలో బ్రేకులు పడడం మేకర్స్ కి షాకిచ్చింది.

కానీ ది కేరళ స్టోరీ 2 నిర్మాతలు కేరళ హై కోర్టు తీర్పు ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. 

Kerala HC Stays Kerala Story 2 Release For 2 Weeks

the kerala story 2