ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun Rayalaseema fans dress code

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకీ వింత

Allu Arjun Rayalaseema fans dress code

స్టార్ హీరోలకే కాదు చిన్న హీరోలకు అభిమానులు ఉంటారు, అభిమాన సంఘాలు ఉంటాయి. కానీ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం చాలా డిఫరెంట్.. మొదటిసారి అల్లు ఆర్మీ అంటూ ఓ సెన్సేషన్ కు తెర తీసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు మరో వింత ఆచారానికి తెర లేపారు.

అది కూడా డ్రెస్ కోడ్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ షాకిచ్చారు. రీసెంట్ గా అల్లు అర్జున్ అభిమాన సంఘాలను కలిసి ఫ్యాన్స్ అసోసియేష‌న్ అంటూ ఫొటోస్ దిగారు. అది మీడియాకి సమాచారమిచ్చారు. ఇప్పుడు రాయ‌ల‌సీమ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ యాక్టివేట్ అయ్యింది. రాయ‌ల‌సీమ‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ ఏర్పాటు అయ్యిందన్న‌ట్టు ఆయన టీమ్  ఫొటో విడుద‌ల చేసింది. 

ఆ పిక్ లో ఫ్యాన్స్ అంతా ఒకే డ్రెస్ కోడ్ అంటే యూనిఫామ్ లో కనిపించారు. ఇది చాలా కొత్తగా కాదు కాదు వింతగా ఉంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ వద్దనుకుని అల్లు ఆర్మీ అంటూ కొత్త పోకడకు తెర లేపిన అల్లు అర్జున్ ఇప్పుడు తన ఫ్యాన్స్ కి డ్రెస్ కోడ్ వేయించాడు అంటూ కామెడీగా మాట్లాడుకుంటున్నారు. 

Allu Arjun

allu arjun