వైష్ణవితో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్
Shanmukh Jaswanth engagement with Vaishnaviయూట్యూబర్ గా షార్ట్ ఫిలిమ్స్ తో ఎంతో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్ తన పాపులారిటీని బిగ్ బాస్ లోకి వెళ్లి పోగొట్టుకున్నాడు. సిరి హన్మంత్ తో బిగ్ బాస్ హౌస్ లో చేసిన ఫ్రెండ్ షిప్ వల్ల అతను ప్రేమించిన దీప్తి సునయన ను కోల్పోయాడు. ఆతర్వాత మెల్లగా మళ్లీ ఫామ్ లోకి వస్తున్న షణ్ముఖ్ ఓ కేసులో అరెస్ట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.
సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్న షణ్ముఖ్ కొద్దిరోజుల క్రితం తను ప్రేమలో పడినట్లుగా అమ్మాయి పేస్ చూపించకుండా తన ప్రేమను అనౌన్స్ చేసాడు. ఈరోజు ఫిబ్రవరి 25 న షణ్ముఖ్ జస్వంత్ తను ప్రేమించిన అమ్మాయి వైష్ణవి ని అంగరంగ వైభవంగా నిశ్సితార్ధం చేసుకుని ఆ ఫొటోస్ ని షేర్ చేసాడు.
ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని తను చేసుకోబోయే వైష్ణవి చోడిశెట్టి ని అందరికి పరిచయం చేస్తూ ఫ్యాన్స్ కు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. తనకు కాబోయే భార్యని ఎత్తుకుని గాల్లోకి తిప్పుతూ, వేలికి నిశ్చితార్ధపు ఉంగరాన్ని తొడుగుతున్న పిక్స్ షేర్ చేసాడు. దానితో షణ్ముఖ్ ఇంకా వైష్ణవి చోడిశెట్టి కి స్నేహితులు, ప్రముఖులు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు.
Shanmukh Jaswanth - Vaishnavi Chodisetti Engaged







































