అదిరిపోయే సలహా ఇస్తున్న తమన్నా

Tamannaah gives great advice

చాలామంది హీరోయిన్స్ క్రేజ్ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే సర్దేసుకోవాలని ఆలోచిస్తారు. సినిమాల్లో ఫేమ్ ఉన్నప్పుడే పలు వ్యాపారాలు మొదలు పెడతారు. ఒకవేళ సినిమా ఆఫర్స్ తగ్గినా ఆ వ్యాపారాల్లో రాణిస్తూ ఉంటారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్స్ ఈ పద్ధతినే ఫాలో అవుతారు. 

తాజాగా తమన్నా కూడా చాలామంది హీరోయిన్స్ కి అదే సలహా ఇస్తుంది. తాను సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు తన ఆర్థిక వ్యవహారాలన్నీ తన తండ్రి చూసుకునేవారని, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. జ్యువెలరీ షాప్ పెట్టాను, అలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నాను.

నేను ఇలా ఆలోచించడానికి నా తండ్రి కారణం. అలా బిజినెస్ ని ఎంచుకుంటే అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఈ అవకాశాలు ఎప్పటివరకు ఉంటాయో తెలియదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు కెరీర్ మంచిగా ఉన్నప్పుడే ఆ డబ్బు ని ఎలా, ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఆలోచించుకోవాలి అంటూ తమన్నా తన తోటి నటీమణులకు అదిరిపోయే సలహాలు ఇస్తుంది. 

తమన్నా చెప్పింది అని కాదు.. ఇది అక్షరాలా నిజం. అవకాశాలు ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ అవకాశాలు తగ్గగానే పాతాళంలో కనిపిస్తారు. కానీ సరైన మార్గంలో పెట్టుబడులు పెడితే అది ఎప్పటికైనా సేఫె కదా. 

Tamannaah Bhatia talks about her Business

tamannaah