నాని లోని మరో కోణం
Paradise-Nani turns massier with Aya Sherహీరో నాని అంటే సేఫ్ హీరో, ఆయనతో సినిమాలు చేస్తే నిర్మాతలకు భరోసా, యావరేజ్ అయినా బయటపడిపోతామనే నమ్మకం. వరసగా బోలెడన్ని సక్సెస్ లు. ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకుండా తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న హీరో నాని ఇదే అందరి ముఖ్యంగా అభిమానుల నమ్మకం. ఇక దసరా తో ఫ్యాన్ ఇండియా లో సక్సెస్ అవ్వని నాని ఈసారి ప్యాన్ ఇండియా స్టార్స్ కి ఛాలెంజ్ విసిరాడు.
ద ప్యారడైజ్ తో ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు, బ్లడీ రోమియా తో మరో మాస్ ని చూపించబోతున్నాడు. నాని బర్త్ డే స్పెషల్ గా సోషల్ మీడియా మొత్తం జడల్ జడల్ అంటూ నాని చూపించిన మాస్ కి మాస్ ఆడియన్స్ పిచ్చగా కనెక్ట్ అవుతున్నారు. అంతేకాదు ప్యారడైజ్ నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ ప్రోమో లో నాని డాన్స్ చూసి షాక్ అయ్యారు.
నాని లోని మరోకోణాన్ని ఈ డాన్స్ తో స్టెప్స్ చూపించారు. టాప్ స్టార్స్ డాన్స్ కి ఏ మాత్రం తీసిపోని హుక్ స్టెప్ తో నాని అందరికి దిమ్మతిరిగే షాకిచ్చాడు, సోషల్ మీడియా మొత్తం నాని డాన్స్ గురించి మాట్లాడుకునేలా ఆయా షేర్ లో నాని డాన్స్ ఉంది. మరి నాని ఈసారి పాన్ ఇండియా ని లైట్ గా అనుకోవడం లేదు, కొడితే పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవ్వాలని నాని ఫిక్స్ అయ్యాడు.
Aya Sher unveils Nani different angle in The Paradise






































