ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Deverakonda-Rashmika wedding update

విజ‌య్ - ర‌ష్మిక పెళ్లిలో అంబానీ

Vijay Deverakonda-Rashmika wedding update

విజయ్ దేవరకొండ-ర‌ష్మిక మంద‌న్న జంట ఈనెల 26 న పెళ్లితో ఒక‌ట‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 4న సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు, రాజ‌కీయ రంగ స్నేహితుల కోసం హైద‌రాబాద్ లో భారీ రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది.

అయితే రాజ‌స్తాన్- ఉద‌య్ పూర్ లో జ‌రుగుతున్న ప్రీవెడ్డింగ్ వేడుక‌ల‌కు అంబానీ కుటుంబం హాజ‌రైందంటూ ప్ర‌చారం సాగుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంద‌న్న జంట ఫోటోల‌తో పాటు, అంబానీ కుటుంబం ఫోటోల‌ను జోడించి నెటిజ‌నులు జోరుగా వైర‌ల్ చేస్తున్నారు? అయితే ఇది నిజ‌మా? ఇందులో ఎలాంటి నిజం లేద‌ని తెలుస్తోంది.

ఒక ప్రత్యేక విమానంలో అంబానీ కుటుంబం ఉద‌య్ పూర్ విమానాశ్ర‌యానికి చేరుకోవ‌డంతో ఈ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీలు వివాహ వేడుకకు హాజరవుతారని తామ‌ర‌తంప‌ర‌గా మీడియాలు ప్ర‌చారం చేసాయి. అయితే అంబానీ కుటుంబం ఉదయపూర్ సందర్శనకు రష్మిక, విజయ్ వివాహానికి ఎటువంటి సంబంధం లేదని తాజా క‌థ‌నాలు చెబుతున్నాయి. నాథ‌ద్వారాలో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో ఆశీర్వాదం పొందడానికి కుటుంబ సభ్యులు ఉదయపూర్ వెళ్లినట్లు సమాచారం.

Vijay Deverakonda-Rashmika

rashmika