పవన్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసిన హరీష్
Harish Shankar disappointed Pawan fansపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కలయికలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 న విడుదల కాబోతుంది. గతంలో ఉస్తాద్ నుంచి వదిలిన గాజు గ్లాస్ తో పవన్ చెప్పిన డైలాగ్ పొలిటికల్ గా ఎంతగా పేలిందో అందరికి తెలుసు. అందుకే పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయని ఆశపడుతున్నారు.
ఆరా ఆఫ్ ఉస్తాద్ చూసాక డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పొలిటికల్ డైలాగ్స్ వాడిస్తే బాగా పేలుతాయని అనుకుంటున్నారు. ఈసారి వైసీపీ కి మూడేలా ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్స్ ఉంటాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ ని డిజప్పాయయింట్ చేసేసారు.
ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎలాంటి రాజకీయ అంశాలు, అలాగే సెటైర్లు కానీ రెఫరెన్సులు ఉండవని దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా బాంబ్ పేల్చాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ, ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని హరీష్ శంకర్ స్పష్టం చేశారు.
మరి పవన్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసే వార్తే. కానీ సినిమా ని సినిమాలా, రాజకీయాలను రాజకీయాల్లా చూడాలని పవన్ కళ్యాణ్ హరీష్ కి చెప్పబట్టే హరీష్ శంకర్ ఉస్తాద్ లో పొలిటికల్ సైడ్ లేకుండా జాగ్రత్త పడినట్లుగా ఉంది వ్యవహారం.
Harish Shankar - Ustaad Bhagat Singh







































