ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rakshit Shetty friend Pramod Shetty about Rashmika Marriage

పెళ్లికి రెడీ అయిన హీరోయిన్‌పై మాజీ వ్యంగ్యం

Rakshit Shetty friend Pramod Shetty about Rashmika Marriage

ఓవైపు పందిట్లో పెళ్లి సంద‌డి.. డూడూ భాజాలు మోగుతున్నాయి. ప‌చ్చ‌ని తోర‌ణాల‌తో ఇల్లంతా క‌ళకళ‌లాడుతోంది. నేడో రేపో తాళి క‌ట్టు శుభ‌ముహూర్తం.. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలోనే పెళ్లి కూతురు మాజీ ప్రియుడు లైన్ లోకొచ్చాడు. అత‌డు నేరుగా బ‌రిలో దిగ‌క‌పోయినా కానీ, త‌న స్నేహితుడితో ఈ పెళ్లిపై వ్యంగ్యాస్త్రాలు, వెట‌కారాల‌తో అట్టుడికిస్తున్నాడు.

పెళ్లికి ఇంకా పిల‌వ‌లేదు.. పిలిస్తే క‌చ్ఛితంగా వ‌స్తాను.. అయినా పిల‌వ‌ద‌ని తెలుసులే.. ! అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు ఆ మాజీ స్నేహితుడు. అయినా మావోడు ఇంకా చాక్లెట్ తింటూ బాధ‌ప‌డేంత ప‌సిపిల్లాడు కాదులే అని కూడా మాజీ ప్రియుడి గురించి వ్యాఖ్యానించాడు.

ఈ మొత్తం వ్య‌వ‌హారం ర‌ష్మిక మంద‌న్న‌, ఆమె మాజీ ప్రియుడు ర‌క్షిత్ శెట్టి, అత‌డి స్నేహితుడు ప్ర‌మోద్ శెట్టి గురించే. ప్ర‌మోద్ శెట్టి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ర‌ష్మిక గురించి వ్యంగ్యంగా మాట్లాడాడు. వెట‌కారం ప్ర‌ద‌ర్శించాడు. ఈ ముగ్గురూ ఇంత‌కుముందు కిరిక్ పార్టీ అనే కన్న‌డ చిత్రంలో న‌టించారు. కానీ ర‌క్షిత్ నుంచి బ్రేక‌ప్ అయిన ర‌ష్మిక టాలీవుడ్ లో క‌థానాయిక‌గా షైన్ అయింది. ర‌క్షిత్ తో నిశ్చితార్థం అయినా కానీ, త‌ర్వాత కెరీర్ కోసం పెళ్లిని కాద‌నుకుంది. అందుకే ఇప్పుడిలా ర‌క్షిత్ శెట్టి స్నేహితుడు ప్ర‌మోద్ శెట్టి వెట‌కారంగా కామెంట్లు చేసాడు. 

అయితే ప్ర‌మోద్ శెట్టి ఈ స‌మ‌యంలో ఇలా వ్యాఖ్యానించ‌డాన్ని నెటిజ‌నులు త‌ప్పు ప‌ట్టారు. పాత విష‌యాలు మ‌ర్చిపోయి ఓ ఇంటిది అవుతున్న ర‌ష్మిక‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు. ర‌ష్మిక మంద‌న్న‌- విజ‌య్ దేవ‌ర‌కొండ జంట రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో పెళ్లాడుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

Rakshit Shetty friend Pramod Shetty

pramod shetty