బ‌న్నీ కోసం లోకేష్ చివ‌రి అస్త్రం!

Allu Arjun-Lokesh Kanagaraj

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇద్దరి క‌ల‌యిక‌లో ఓ భారీ య‌క్షన్ థ్రిల్ల‌ర్ ప‌ట్టాలెక్క‌నుంది. ఇదే ఏడాది ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. అయితే లోకేష్ వ‌ద్ద ఇప్ప‌టికే ఆరు  క‌థ‌లు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ఏ క‌థ‌ను బ‌న్నీ కోసం తీస్తున్నాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రం.

బ‌న్నీ కోసం ఏ స్క్రిప్ట్ బ‌యట‌కు తీసినా? అది సంచ‌న‌ల‌మ‌వ్వాలి. ఎందుకంటే అట్లీ సినిమా రిలీజ్ అనంత‌రం హిట్ అయితే బ‌న్నీ రేంజ్ గ్లోబ‌ల్ స్థాయికి వెళ్లిపోతుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ గా ఆ  చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో లోకేష్ కూడా అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి ప్లాన్ చేస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో ఓ విష‌యం లీకైంది. బ‌న్నీ కోసం లోకేష్ త‌న చిట్ట చివ‌రి క‌థ‌ను తీస్తున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. త‌న వ‌ద్ద ఉన్న ఆరు క‌థ‌లు కూడా భారీ యాక్ష‌న్ కంటెంట్ ఉన్న చిత్రాలే. ఈ విష‌యాన్ని లోకేష్ ముందే రివీల్ చేసాడు. ఈ ఆరేళ్ల పాటు త‌న‌న నుంచి ర‌క్త పాత్ర‌, హింస‌తో కూడిన చిత్రాలు త‌ప్ప మ‌రేవి రావు.

దీంతో బ‌న్నీ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చివ‌రి క‌థ అయితే ప‌క్కాగా యాప్ట్ అవుతుంద‌ని..ఆ క‌థ‌కి మ‌రింత ప‌దును పెట్టిస్తున్నాడుట‌. దీనికి సంబంధించి లోకేష్ రైట‌ర్ల బృందం ప‌ని చేస్తోంద‌ని వినిపిస్తోంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను మ‌రింత క్రియేటివ్ గా డిజైన్ చేయిస్తున్నాడుట‌. అదీ సంగ‌తి. 

Lokesh Kanagaraj

lokesh kanagaraj