పీసీ స‌ముద్ర‌పు దొంగ విన్యాసాలు

Priyanka Chopra The Bluff

గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా (పీసీ) ఎంపిక‌లు నిరంత‌రం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉన్నాయి. పీసీ `రామ్ లీల` చిత్రంలో ప్రియుడి కోసం త‌ప‌న ప‌డే యువ‌తిగా క‌నిపించింది. ఆ త‌ర్వాత అందుకు భిన్న‌మైన యాక్ష‌న్ పాత్ర‌ల‌తోను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. క్వాంటికో సిరీస్‌, సిటాడెట్ సిరీస్ ల‌లో యాక్ష‌న్ క్వీన్ అవ‌తారంతో అద‌ర‌గొట్టింది. బాలీవుడ్ టు హాలీవుడ్ .. హాలీవుడ్ టు టాలీవుడ్ ఈ అమ్మడి జ‌ర్నీ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. చివ‌రిగా విడుద‌లైన `హెడ్స్ ఆఫ్ స్టేట్` చిత్రంలోను పీసీ యాక్ష‌న్ క్వీన్ గా న‌టించి మెప్పించింది.

ఇప్పుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి `వార‌ణాసి` చిత్రంలోను పీసీ చీర‌క‌ట్టులో అడ్వెంచ‌ర్స్ చేసే యాక్ష‌న్ క్వీన్‌ని త‌ల‌పిస్తోంది. ఈ పాత్ర పేరు మందాకిని ఆస‌క్తిని క‌లిగించింది. అయితే వార‌ణాసి కంటే ముందే పీసీ న‌టించిన `ది బ్ల‌ఫ్` హాలీవుడ్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. 

ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌రీబ‌యిన్ స‌ముద్ర‌పు దొంగ‌గా క‌నిపించ‌బోతోంది. త‌న కుటుంబాన్ని కాపాడుకునేందుకు సాహ‌సాలు చేసే మాజీ స‌ముద్ర‌పు దొంగ‌గా పీసీ విన్యాసాల్ని తెర‌పై వీక్షించ‌బోతున్నాం. ఇప్ప‌టికే విడుద‌లైన ది బ్ల‌ఫ్ ట్రైల‌ర్ లో పీసీ న‌ట‌న‌కు రాజ‌మౌళి ప్ర‌శంస‌లు కురిపించారు. చాలా మంది ప్ర‌ముఖుల దృష్టిని ఈ పాత్ర ఆక‌ర్షిస్తోంది. వ‌రుసగా సూప‌ర్ గాళ్ పాత్ర‌ల‌తో అల‌రిస్తున్న పీసీ మునుముందు న‌టించ‌నున్న చిత్రాల్లోను ఎలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌బోతోందో వేచి చూడా

Priyanka Chopra

priyanka chopra