శ్రీలీల - అప్పుడు తెలుగు ఇప్పుడు తమిళ్
Back to Back Tamil Offers for Sreeleelaతెలుగులో పెళ్లి సందD తో హీరోయిన్ గా చిన్న వయసులోనే వెండితెర కు పరిచయమైన క్యూట్ బ్యూటీ శ్రీలీలకు రవితేజ తో చేసిన ధమాకా బ్రేక్ నిచ్చింది. ఆతర్వాత శ్రీలీల టాలీవుడ్ లో అరడజనకు పైగా హీరోలతో నటించింది. సూపర్ స్టార్ మహేష్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ శ్రీలీల కు అసలు హిట్ అనేది దక్కలేదు. బాలయ్య తో భగవంత్ కేసరి చేసింది, అది హిట్ అయ్యింది కానీ మేజర్ క్రెడిట్ బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది.
ఒకప్పుడు తెలుగు హీరోలకు కేరాఫ్ గా మారిన శ్రీలీల ఇప్పుడు మెల్లగా తెలుగు ను అవాయిడ్ చేస్తూ తమిళ్ లో బిజీ అవుతుంది. అప్పట్లో తెలుగు ఆఫర్స్ ఎలా శ్రీలీల తలుపు తట్టాయో, ఇప్పుడు తమిళనాట అలానే అవకాశాలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న పరాశక్తితో పరాభవం పాలైన శ్రీలీలకు ఆ వెంటనే ధనుష్-అమరన్ డైరెక్టర్ కాంబో D55 లో ఛాన్స్ దక్కింది.
ఇప్పుడు విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సో అటు ధనుష్, ఇటు ధృవ్ సినిమాలను ఒకేసారి శ్రీలీల లైన్ లో పెట్టింది. మరి అప్పట్లో తెలుగు హీరోలు శ్రీలీల కు వరసగా ఛాన్స్ లు ఇస్తే.. ఇప్పుడు తమిళ హీరోలు శ్రీలీల కు అలానే ఆఫర్స్ ఇస్తున్నారు.
Sreeleela Getting Busy In Tamil







































