డిజిటల్ వైపు టిల్లు అడుగులు

Siddhu Jonnalagadda

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్ కి దగ్గరైన స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఆతర్వాత జాక్, తెలుసు కదా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ఖాతాలో పడేసరికి కాస్త డల్ అయ్యాడు. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్న సిద్దు జొన్నలగడ్డ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాడనే వార్త తెగ వైరల్ అవుతోంది. అంటే సిద్దు ఓటీటీ వైవు చూస్తున్నాడు.

అది కూడా క్రేజీ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్య తో ఓ మూవీ చేస్తున్నారు. అది కూడా సితార బ్యానర్ లోనే. ఇప్పుడు సిద్దు ని మెయిన్ లీడ్ లో పెట్టి వెబ్ సీరీస్ ని వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే దీనిపై సిద్దు తో చర్చలు జరిగాయని తెలుస్తుంది. మరి రెండు డిజాస్టర్స్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ ఇలా ఆలోచించడం కరెక్ట్ అంటున్నారు ఆయన అభిమానులు. చూద్దాం సిద్దు మూవీతోనా, లేదంటే వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తాడో అనేది. 

Siddhu Jonnalagadda signs his first OTT series

siddhu jonnalagadda