నిశ్చితార్థాన్ని దాచి మోసం చేసిన హీరో

Mamta Mohandas

టాలీవుడ్ లో `యమ‌దొంగ` స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన మ‌మ‌తా మోహ‌న్ దాస్.. అక‌స్మాత్తుగా పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పెళ్లి బ్రేక‌ప్ అవ్వడం త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఊహించ‌ని మ‌లుపు. అప్ప‌టికే ప్ర‌ముఖ హీరోతో ప్రేమ‌లో బ్రేక‌ప్ అయి తీవ్ర మాన‌సిక స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్న మ‌మ‌త పెళ్లి కూడా బ్రేక‌ప్ అవ్వ‌డంతో వ్య‌క్తిగ‌తంగా చిక్కుల్లో ప‌డ్డాన‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు.

నేను క్యాన్స‌ర్ , బొల్లి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడే ప్రేమ వ్య‌వ‌హారంలోను తీవ్ర మోసానికి గుర‌య్యాన‌ని చెప్పారు మ‌మ‌తా మోహ‌న్ దాస్.. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడితో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు అత‌డికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందని తెలిసింది. దానిని అత‌డు దాచి ఉంచి మోసం చేసాడని వెల్ల‌డించారు. 

తాజాగా సుహాసిని మ‌ణిర‌త్నంతో పాడ్ కాస్ట్ లో త‌న వ్య‌క్తిగ‌త జీవితంలోని చాలా ర‌హ‌స్యాల‌ను ఓపెన‌య్యారు. మ‌మ‌త 2011లో త‌న చిన్ననాటి స్నేహితుడు ప్ర‌జిత్ ని పెళ్లాడారు. కానీ ఈ జంట‌ 6 నెల‌ల‌కే విడిపోయారు. ప్ర‌స్తుతం మ‌మ‌తా మోహ‌న్ దాస్ మ‌ల‌యాళంలో ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

 

Mamta Mohandas revealed her openness to remarriage

mamta mohandas