చిరు-సురేఖకు అల్లు వారి మొదటి ఆహ్వానం
Allu Sirish meets Chiranjeevi to personally hand over first wedding inviteఅల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ పెళ్లి మార్చ్ 16 న జరగబోతుంది. దుబాయ్ లో అల్లు వారి ప్రీ వెడ్డింగ్ పార్టీ, రెండు రోజుల క్రితమే అల్లు అరవింద్ ఇంట్లో పసుపుకొట్టే వేడుక చాలా ఘనంగా జరిగాయి. అల్లు శిరీష్-నయనిక లు ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. పెద్దల అంగీకారంతో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది.
ఇక అల్లు వారి పెళ్లి పత్రికలు వచ్చేసాయి. ఈరోజు అల్లు అరవింద్ తన భార్య అలాగే కొడుకు అల్లు శిరీష్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి అల్లు శిరీష్ వివాహ మొదటి పత్రికను అందించారు. చిరు-సురేఖలకు నూతన వస్త్రాలను బహూకరించి మరీ మొదటి పత్రికను అందించిన పిక్ వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరు చేతికి చిన్న సర్జరీ జరిగిన కారణంగా ఆయన భుజానికి షోల్డర్ బ్యాగ్ వేసుకుని ఆ పిక్చర్ లో కనిపించారు. మావయ్య చిరు-అత్త సురేఖ లకు తన మొదటి పెళ్లి పత్రికను అల్లు శిరీష్ అందించాడు.
Allu Sirish First Wedding Invitation Given to Megastar Chiranjeevi







































