తమన్నా మాజీ మళ్లీ ప్రేమలో
Is Vijay Varma In Love after Splotting with Tamannaahమిల్కీ వైట్ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమాయణం గురించి తెలిసిందే. మూడేళ్ల పాటు ఈ జంట నిండా ప్రేమలో మునిగి తేలారు. కానీ అనూహ్యంగా విడిపోయారు. 2026 ఆరంభంలో బ్రేకప్ గురించి చాలా పుకార్లు వచ్చినా, ఈ జంట మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ వారి యాక్టివిటీస్ గమనిస్తే, ఇద్దరూ దూరమయ్యారనేందుకు ఆధారాలు చాలా ఉన్నాయి. ఈ జోడీ అకస్మాత్తుగా కలిసి ఈవెంట్లకు వెళ్లడం మానేసారు. అయితే సోషల్ మీడియాల్లో ఒకరినొకరు అన్ ఫాలో కాకుండా సైలెంట్ గా ఉన్నారు. వారి పాత ఫోటోలను కూడా తొలగించకపోవడంతో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ జంట విడిపోవడానికి ప్రధాన కారణం కెరీర్ పరమైన ప్రణాళికల్లో సింక్ కుదరకపోవడమేనని కూడా కథనాలొచ్చాయి. ప్రస్తుతం ఈ జంట ఎవరికి వారు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పుడు విజయ్ వర్మ వేలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న చేసిన ఓ పోస్ట్ కలకలం రేపింది. అతడు ఒక అమ్మాయి చేతిని పట్టుకుని ఉన్న ఒక గుంభనమైన పోస్ట్ చేసాడు. దీనికి ``హ్యాపీ వేలెంటైన్స్ డే టు మై ఫరెవర్`` అని క్యాప్షన్ ఇచ్చి ఖుషి అహూజా అనే హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. దీంతో విజయ్ మళ్లీ ప్రేమలో పడ్డాడు అంటూ నెటిజనులు భావించారు. కానీ ట్యాగ్ చేసిన అకౌంట్ కి వెళ్లి చూస్తే, అది అహూజా అకౌంట్ కాదు. అది ఒక ర్యాండమ్ అకౌంట్ అని తేలింది. అక్కడ ఫన్నీ ఫ్రాంక్! అంటూ విజయ్ అసలు విషయం బయటపెట్టాడు. దీంతో తమన్నాతో బ్రేకప్ అయినా విజయ్ ఇంకా ప్రేమలో పడలేదని ఖరారైంది. అతడు ఇంకా ఒంటరి అని ప్రూవైంది.
Vijay Varma dating someone new after his breakup








































