ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Four heroines have been finalized in AA22

అల్లు అర్జున్ తో ఆ నలుగురు

Four heroines have been finalized in AA22

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 భారీ సక్సెస్ తర్వాత అంతకు మించి అనేట్లుగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA 22 స్టార్ట్ చేసాడు, ఈ చిత్రం అనౌన్స్ వీడియో తోనే హాలీవుడ్ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది. ఇప్పటికే దీపికా AA 22 షూట్ లో జాయిన్ అయ్యింది.

దీపికా తో పాటుగా అట్లీ మరో ముగ్గురు ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకుంటున్నారనే న్యూస్ నిజమవుతుంది. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ ఈ చిత్ర షూట్ లో జాయిన్ అవ్వగా.. రష్మిక మందన్న తో అట్లీ  నెగెటివ్ రోల్ చేపించడం హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప లో రష్మిక అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది. AA 22 లో మాత్రం నెగెటివ్ రోల్ చేస్తుంది.

ఇప్పుడు దేవర తో సౌత్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కూడా AA 22 లో భాగమవుతుంది అని తెలుస్తుంది. జాన్వీ కపూర్ అల్లు అర్జున్-అట్లీ మూవీలో స్పెషల్ రోల్ చేస్తుంది అనే టాక్ ఉన్నా.. ఇప్పుడు జాన్వీ కపూర్ రోల్ చాలా కీలకంగా ఉండబోతుంది అని తెలుస్తుంది. సో అల్లు అర్జున్ తో ఒక్కరు కాదు నాలుగు రొమాన్స్ చెయ్యబోతున్నారు. 

Janhvi Kapoor in AA22

aa22