కపుల్ ఫ్రెండ్లీ ప్రీమియర్స్ టాక్

Couple Friendly Premiers talk

రెండేళ్ల తర్వాత కపుల్ ఫ్రెండ్లీ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు హీరో సంతోష్ శోభన్. పెద్ద బ్యానర్(యువి క్రియేషన్స్), ఆసక్తికర ప్రమోషన్స్ తో కపుల్ ఫ్రెండ్లీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించినా.. చిన్న సినిమా అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉంది. అసలు ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారా, రారా అనే ఆలోచన లేకుండా మేకర్స్ ప్రీమియర్స్ తో కొట్టాలని ప్లాన్ చేసారు. 

ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. ఈరోజు కపుల్ ఫ్రెండ్లి తో సంతోష్ శోభన్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా గత రాత్రే ప్రీమియర్స్ తో సందడి చేసారు. కపుల్ ఫ్రెండ్లీ కి ప్రీమియర్స్ తోనే మంచి టాక్ స్టార్ట్ అయ్యింది. సినిమా సింపుల్ గా ఆకట్టుకుంది, ట్విస్ట్ లు కామెడీ లేకపోయినా సినిమా నీట్ గా ఉంది. సంతోష్ శోభన్ యాక్టింగ్ బావుంది. మానస వారణాసి అందంగా ఆకట్టుకుంది.   

మ్యూజిక్ యావరేజ్ గా ఉన్నా ఎడిటింగ్ షార్ప్ గా క్రిస్పీ గా ఉంది. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ గా హిట్ కొట్టాడు అంటూ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు చెబుతున్న మాట.

Couple Friendly Premiers show talk

couple friendly