ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Peddi-Chikiri Chikiri Song Major Hook Steps was Composed by Ram Charan

పెద్ది - ఆ క్రెడిట్ రామ్ చరణ్ దే

Peddi-Chikiri Chikiri Song Major Hook Steps was Composed by Ram Charan

పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఎంత పెద్ద హిట్టో అనేది ఇంకా ఇంకా యూత్ ఫోన్స్ లో ట్రెండ్ అవుతుంటేనే అర్ధమవుతుంది. రామ్ చరణ్ సూపర్బ్ స్టెప్స్, జాన్వీ కపూర్ అందాలు, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అన్ని చికిరి చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణమయ్యాయి. ఈ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. 

అయితే ఈ సాంగ్ లో హుక్ స్టెప్ ని రామ్ చరణ్ స్వయంగా కంపోజ్ చేసినట్టుగా జానీ మాస్టర్ రీసెంట్ గా బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సాంగ్ వింటే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ రావడం గ్యారెంటీ, చికిరి చికిరి సాంగ్ నాకు తెలిసి 10 లక్షల సార్లు విని ఉంటా.. కానీ ఇప్పటికీ ఆ పాట వస్తే నాకు లేచి డాన్స్ చేయాలనిపిస్తోంది..

అసలు ఈపాటలో హుక్ స్టెప్ ని రామ్ చరణ్ కంపోజ్ చేసారు. కానీ రామ్ చరణ్ క్రెడిట్ తాను తీసుకోకుండా తనకే ఇచ్చినట్టుగా జానీ మాస్టర్ ఓ బుల్లితెర డాన్స్ షో లో బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఇది విన్న మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ క్రియేటివిటీకి తెగ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

Jani Master revealed that Ram Charan himself composed the hook step for the Chikiri song

ram charan