అనిల్ రావిపూడికి వారే దిక్కా

Director Anil RavipudiDirector Anil Ravipudi

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఇప్పటివరకు కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేదు. అపజయం ఎరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి కి కేవలం సీనియర్ హీరోలే దొరుకుతున్నారా, ఆయనకి యంగ్ మరియు స్టార్ హీరోలు దొరకడం లేదా, లేదంటే అనిల్ రావిపూడి వారితో సినిమాలు చెయ్యడం లేదా.. సీనియర్ హీరోలకు కేరాఫ్ గా మారిన హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరసగా వారితోనే సినిమాలు చెయ్యడం నిజంగా ఆశ్చర్యకర విషయమే. 

గత ఏడాది విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ రావిపూడి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రూ.350 కోట్లు కొల్లగొట్టి తనెంత స్ట్రాంగ్ అంటూ తన మార్క్ చూపించాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తాడు, మీడియం బడ్జెట్ పెట్టి మూడింతలు లాగుతాడు. 

మరి ఇలాంటి టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని కుర్ర హీరోలు, స్టార్ హీరోలు ఎందుకు నమ్మడం లేదు. వెంకటేష్ తో ఇప్పడు కూడా తన తదుపరి ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యబోతున్నారు అనే టాక్ ఉంది. చిరు, బాలయ్య లతో సినిమాలు చేశారు. మిగిలింది నాగార్జున మాత్రమే. అది త్వరలోనే అయిపోయితుంది. కానీ యంగ్ హీరోలే అనిల్ రావిపూడి వైపు చూడట్లేదో, అనిల్ రావిపూడే వాళ్ళను లైట్ తీసుకుంటున్నాడో తెలియదు కానీ.. ఆయన మాత్రం సీనియర్ హీరోలకే పరిమితమవుతున్నారు. 

Anil Ravipudi

anil ravipudi