అనిల్ రావిపూడి కౌంటర్ అదిరింది
Anil Ravipudi social media post viralచాలామంది సోషల్ మీడియా వేదికగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు తర్వాత చెయ్యబోయే సినిమాపై రకరకాల ఊహాగానాలతో ఊదరగొట్టేస్తున్నారు. అనిల్ రావిపూడి మళ్లీ వెంకటేష్ తోనే మూవీ చేస్తున్నారు, అలాగే మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు.
వెంకీ-ఫహద్-బావమరుదుల్లా కనిపించబోతున్నారు, అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు, జూన్ నుంచి ఆయన తన తదుపరి మూవీని పట్టాలెక్కించి వచ్చే ఏడు సంక్రాంతికి రిలీజ్ చెయ్యబోతున్నారంటూ ప్రచారం చెయ్యడమే కాదు.. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు అందులో పూజ హెగ్డే ఒక హీరోయిన్ అంటూ చెబుతున్నారు.
మరి ఈ ఊహాగానాలకు దర్శకుడు అనిల్ రావిపూడి అదిరిపోయే మీమ్ జిఫ్ ని షేర్ చేస్తూ కౌంటర్ వేసాడు.
నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏
నటినటులు
కధ
టైటిల్ కూడా
పెట్టేసారు
ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄
మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను....
అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో...నిజమైన
పూర్తి వివరాలు... మీకు అందిస్తాం.. అంటూ సోషల్ మీడియాలో వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Director Anil Ravipudi






































