ఒకే రోజు ఓటీటీలో రెండు హిట్ మూవీస్

Two hit movies on OTT on the same day

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి, ది రాజసాబ్ చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటే. ఇప్పుడు రెండు హిట్టు చిత్రాలు ఒకేరోజు ఓటీటీ ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాయి. అవే జనవరి 12 న విడుదలైన మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు, జనవరి 14 న విడుదలైన నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరోజు చిత్రాలు.

రెండు డిఫ్రెంట్ డిఫ్రెంట్ ఓటీటీల నుంచి ఒకేరోజు అంటే రేపు ఫిబ్రవరి 11 న స్ట్రీమింగ్ లోకి రాబోతున్నాయి. చిరు మన శంకర వరప్రసాద్ గారు థియేటర్స్ లో రూ.350 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం జీ 5 నుంచి రేపు స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్స్ లో రూ.100 కోట్ల మార్క్ ని  టచ్ చేసిన కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు కూడా రేపటినుంచి ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వస్తుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నుంచి ఫిబ్రవరి 11 న అనగనగా ఒకరాజు స్ట్రీమింగ్ లోకి వస్తుంది. సో ఒకే రోజు రెండు హిట్టు సినిమాలు ఓటీటీ ఆడియన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యాయన్నమాట. 

Mana SHankara Vara Prasad Garu and Anaganaga Oka Raju streaming on tomorrow

anaganaga oka raju