బోయపాటిది పెద్ద ప్లానింగే

Director Boyapati

అఖండ 2 అంచనాలు అందుకోవడంలో విఫలమవడమే కాదు దర్శకుడు బోయపాటి పై తీవ్ర విమర్శలొచ్చాయి. సింహాన్ని పెట్టుకుని చీప్ గా సినిమా తీసావ్ అంటూ బోయపాటి ని నందమూరి అభిమానులే విమర్శించారు. ఇక బోయపాటి కెరీర్ అగమ్య గోచరమే అనుకుంటున్న సమయంలో బోయపాటి ముంబై వెళ్లిరావడం హాట్ టాపిక్ అయ్యింది.

అక్కడ ధురంధర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రణవీర్ సింగ్ ని కలిసి కథ చెప్పడమే కాదు.. తాజాగా అల్లు అర్జున్ ని మీట్ అయ్యి పూర్తి కథ చెప్పి ఒపించాడనే టాక్ నడుస్తుంది. గతంలో అల్లు అర్జున్ కి సరైనోడు తో బోయపాటి మాస్ హిట్ ఇచ్చాడు. అప్పటినుంచి వారి స్నేహం నడుస్తుంది. మరోసారి బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడని టాక్.

మరి అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో AA 22 చేస్తుంటే.. లోకేష్ కనగరాజ్ తో AA 23 చెయ్యబోతున్నాడు. ఆతర్వాత అల్లు అర్జున్ లైనప్ లో త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ ఉన్నారు. మరి ఈ లైన్ లో బోయపాటి కి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Director Boyapati Srinu

boyapati