థియేటర్స్ లో మూడుముక్కలాట

This week theatrical releasesThis week theatrical releases

గత వారం విడుదలైన సినిమాలన్నీ సోదిలోకి లేకుండా పోయాయి. పొలోమని దిగిన అరడజను సినిమాలు ఏ థియేటర్స్ లో విడుదలయ్యాయో కూడా తెలియదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక ఈవారం క్రేజీ సినిమాలు కాదు కాదు మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. 

అందులో విశ్వక్ సేన్-కాయదు లోహర్ ల ఫంకీ మూవీ, సితార బ్యానర్, కామెడీ డైరెక్టర్ అనుదీప్, క్రేజీ ప్రమోషన్స్ అన్ని వెరసి ఈనెల 13 న ఫంకీ థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఫంకీ ట్రైలర్ తోనే ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ అంటూ కన్ ఫర్మ్ మయింది. సో ఈ చిత్రం ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది.

ఇక రెండో సినిమా స్నేహం, ప్రేమ‌, ఎమోష‌న్స్‌ తో తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ. ఈ చిత్రంతో సంతోష్ శోభన్ రెండేళ్ల బ్రేక్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ ను చాలా డిఫ్రెంట్ గా ప్లాన్ చేసారు. కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్, టీజర్ అన్ని ఆసక్తిగా ఉన్నాయి. 

ఇక ముచ్చటగా మూడో చిత్రం అర్జున్ సీత పయనం. అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సీతా ప‌య‌నం చిత్రంలో అర్జున్ కుమార్తె ఐశ్వ‌ర్య క‌థానాయిక‌. అంతేకాదు అర్జున్‌, ధృవ్ స‌ర్జా గెస్ట్ రోల్స్ లో  క‌నిపించ‌నున్నారు. మరి ఈ వారం థియేటర్స్ లో మూడుముక్కలాట. ఈ ఆటలో గెలుపెవరితో అనేది ఆడియన్స్ తేల్చాల్సిందే. 

This week theatrical movies

funky